- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
258 కేసులు.. 23 మంది డిశ్చార్జ్.. 4 మృతి
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విస్తరిస్తోంది. శనివారం కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ బాధితుల సంఖ్య 258కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 63 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. దేశంలోని 258 మంది కరోనా బాధితుల్లో 38 మంది విదేశీయులు ఉన్నారు. ఇందులో 17 మంది ఇటలీ ముగ్గరు, ఫిలిప్ఫైన్స్ 2, యూకే 2, కెనడా, ఇండోనేషియా, సింగపూర్‌కు చెందిన ఒక్కరు చొప్పున ఉన్నారు. ఇప్పటివరకు 23 మంది కరోనా బారి నుంచి విముక్తి పొందారు. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఢిల్లీలకు చెందిన నలుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 231 మందికి కరోనా పాజిటివ్ ఉందని, 23 మందికి పూర్తిగా నయం కావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని, నలుగురు మృతిచెందారని వైద్య శాఖ తెలిపింది.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. ఆ తర్వాత 40 కేసులతో కేరళ రాష్ట్రం ఉంది. ఇందులో ఏడుగురు విదేశీయులు ఉన్నారు. ఢిల్లీ 26 (ఒక విదేశీయుడు), ఉత్తర్‌ప్రదేశ్ 24 (ఒక విదేశీయుడు), తెలంగాణ 19 (11 మంది విదేశీయులు), రాజస్థాన్ 17 (ఇద్దరు విదేశీయులు), హర్యానా 17 (14 మంది విదేశీయులు), కర్ణాటక 15, లడ్డాఖ్ 13, గుజరాత్ 7, జమ్ముకశ్మీర్ 4, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, పంజాబ్‌ల్లో రెండు చొప్పున కేసులు, పుదిచ్చేరి, చత్తీస్‌గఢ్‌ల్లో ఒక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
Tags: Coronavirus Cases,Rise ,236 To 258 ,India ,Friday, Covid-19