కరోనా ఎఫెక్ట్: నేడు ప్రధాని అధ్యక్షతన అత్యున్నత సమావేశం

by GSrikanth |   ( Updated:2022-12-22 04:55:41.0  )
కరోనా ఎఫెక్ట్: నేడు ప్రధాని అధ్యక్షతన అత్యున్నత సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో మరోసారి కరోనా విజృంభణ ప్రారంభం కావడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా అక్కడ కోవిడ్ మరణాల సంఖ్య గణనీయంగా పెరగడంతో కోవిడ్ కొత్త వేరియంట్‌తో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు అత్యున్నత సమావేశం జరుగనుంది. కాగా, ఇప్పటికే రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని, కొవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసును అర్హులైన అందరూ తీసుకోవాలని సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్షుఖ్‌ మాండవీయ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం సైతం నిర్వహించారు.

కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని, నిఘాను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. చైనా, ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు చేయనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఇంకా ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. పలు దేశాల్లో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, రానున్న పండుగ సీజన్‌ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని మంత్రి మాండవీయ పేర్కొన్నారు.

Also Read..

తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభంపై దిగ్విజయ్ సింగ్ కసరత్తు

Advertisement

Next Story

Most Viewed