హీరో విజయ్ కుటుంబీకులకు కరోనా పరీక్షలు

by Shyam |
హీరో విజయ్ కుటుంబీకులకు కరోనా పరీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. దేశంలోనూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కరోనాను కట్టడి చేసే క్రమంలో విదేశాలకు వెళ్లొచ్చిన వారిని క్వారెంటైన్‌కు తరలిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ విజ‌య్ నివాసంలో ఆరోగ్య శాఖాధికారులు కరోనా టెస్ట్ నిర్వ‌హించారు. విదేశాల‌కు వెళ్లి వ‌చ్చిన వారి లిస్ట్‌లో విజయ్ కూడా ఉండడంతో… కుటుంబీకులందరికీ కరోనా ప‌రీక్ష‌లు చేశారు. అయితే ఎవ‌రికీ క‌రోనా వైర‌స్ సోక‌లేద‌ని స‌ద‌రు ఆరోగ్య‌శాఖా ప్ర‌తినిధులు స్పష్టం చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ మధ్య విజయ్ నివాసంలో ఐటీ రైడ్స్‌‌తో కాస్త టెన్షన్ ఫీల్ అయిన అభిమానులు… కరోనా టెస్ట్ అంటే మరింత ఆందోళన చెందారు కానీ.. నెగెటివ్ రావడంతో ఇప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉన్నారు. కాగా… విజయ్ నటించిన మాస్టర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 9న సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. సినిమాలో విజయ్ కాలేజి ప్రొఫెసర్‌గా నటిస్తుండగా… విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారు. దీంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న సినిమా ఆల్బమ్ కూడా సూపర్ హిట్ అయింది.

Tags: Vijay, CoronaVirus, Covid19, Corona Test

Advertisement

Next Story

Most Viewed