- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాటర్ బోర్డులో కరోనా జాగ్రత్తలు
దిశ, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి వాటర్ బోర్డు కూడా జాగ్రత్త చర్యలను ముమ్మరం చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి అవంతరాలు లేకుండా సేవలు అందించేందుకు పకడ్బందీ చర్యలు పడుతోంది. అత్యవసర సేవల్లో భాగంగా గ్రేటర్ ప్రజలకు సమృద్ధిగా తాగు నీరందించడంతో పాటు మురుగునీటి సమస్య లేకుండా చేయడంతో పాటు అధికారుల, సిబ్బంది ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్ తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కార్యాలయాల చుట్టూ హైపోక్లోరైడ్…
హైదరాబాద్‌లోని వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర డివిజన్ కార్యాలయాల చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ఆయా కార్యాలయాల చుట్టూ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారిని స్ప్రే చేపడుతోంది. అందుకు ప్రతి డివిజన్‌లో రెండు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. పారిశుధ్య పనులు, కార్యాలయాలు, రిజర్వాయర్ గోడలతో పాటు రెయిలింగ్, మూత్రశాలలు, వాహనాలు, క్యాష్ కౌంటర్ల పైన పిచికారి చేయనుంది. అందుకు 7వేల లీటర్ల హైపోక్లోరైడ్‌ను అధికారులు సిద్ధం చేశారు. సివర్ క్లీనింగ్ మిషిన్లకు 5వేల లీటర్లు, కార్యాలయాలకు 2వేల లీటర్లు కేటాయించనున్నారు. కార్యాలయాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు.
సిబ్బందికి భద్రత పరికరాలు..
బోర్డులో పనిచేసే క్షేత్రస్థాయి ఉద్యోగులు, లైన్మెన్లు, సివరేజీ సిబ్బంది, ఎయిర్టెక్ మిషన్ సిబ్బంది, ట్యాంకర్ సిబ్బంది అందరికీ తాత్కాలిక పాసులు, వ్యక్తిగత పాసులు, వెహికల్ పాసులు అందజేస్తున్నారు. తాగు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. కార్మికులు, అధికారులకు మాస్కులు, గ్లౌజులు వంటి భద్రత పరికరాలను అందజేయనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడొంతుల నీటిలో ఒక వంతు సోడియం హైపోక్లోరైట్ను కలిపి బాక్టీరియా నిర్మూలనకు పిచికారీ చేయనున్నారు. ఈ పిచికారి చేయడం వలన క్రిమి సంహారణకోసం క్లోరిన్ వాయువు వలె ప్రభావంతంగా పనిచేస్తుందని అధికారులు అంటున్నారు. నగర వ్యాప్తంగా వైరస్ ప్రబలకుండా ప్రత్యేకమైన రసాయనాన్ని స్ప్రే చేసేందుకు 20 ఎయిర్ టెక్ యంత్రాలను జీహెచ్ఎంసీ డిజార్డర్ రీలీఫ్ మేనేజ్ మెంట్ విభాగానికి వాటర్ బోర్డు అందించనుంది.
Tags: corona virus (covid-19), prevention, water board office, hyderabad