- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేఘాలయాలో తొలి కేసు.. ఎలా సోకిందో తెలియదు
మేఘాలయాలో కరోనా వైరస్‌తో 69 ఏండ్ల డాక్టర్ ఒకరు మృతిచెందారు. ఆ రాష్ట్రంలో ఇదే తొలి వైరస్ కేసు. అప్రమత్తమైన అధికారులు ఆ డాక్టర్ కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లోని బెత్తాని హాస్పిటల్‌కు చెందిన ఆ డాక్టర్‌కు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ‘సైలెంట్ క్యారియర్’ ద్వారా వైరస్ సోకినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణ వచ్చారు. ఈ నేపథ్యంలో షిల్లాంగ్‌లో రెండ్రోజులపాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ వ్యాప్తికి కారణమైన వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
కరోనాతో మృతిచెందిన డాక్టర్‌తో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న దాదాపు 2000 మందిని గుర్తించారు. అంతేకాకుండా మార్చి 22కు ముందు బెత్తాని హాస్పిటల్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. రెండు రోజుల క్రితం నాగాలాండ్‌తో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. ప్రస్తుతం మేఘాలయాలో వైరస్ కారణంగా ఒకరు మృతిచెందారు. ఈ క్రమంలో సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలన్నీ కరోనా బారిన పడ్డాయి.
tags: corona virus, pandemic doctor, dies, covid19, meghalaya, first case in state