- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘‘కరోనా’’ పరివర్తన చెందదా?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ (కోవిడ్ -19) మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ ప్రభావం ఎలా తగ్గుతుంది? ఇంతగా జనాన్ని భయపెడుతున్న వైరస్ పరివర్తన ఎలా ఉంది? ఇతర వైరస్‌కు.. కరోనా వైరస్‌కు తేడా ఏంటి? శాస్త్రవేత్తలు, వైద్యులు ఏం చెబుతున్నారు? ఎప్పటిలోగా కోవిడ్-19 వ్యాధికి మందు కనిపెట్టగలమా? కరోనాకు ఒక్క వ్యాక్సిన్ సరిపోతుందా? లేక ప్రతి సారీ అప్‌డేట్ చేయాల్సి వస్తుందా?
మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తున్న కరోనా వైరస్‌లో గణనీయమైన పరివర్తన ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు నావెల్ పాథోజెన్స్ జనెటిక్ కోడ్ గురించి అధ్యయనం చేస్తున్న సైంటిస్టులు. ఆ వివరాలేంటో తెలిపే ‘దిశ’ కథనమది..
‘కరోనా’ పరివర్తన అంతంతే..
కరోనా వైరస్‌లో సాపేక్ష స్థిరత్వం అనేది ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చనీ, అది ప్రమాదకంగా మారొచ్చని కానీ, స్థిరత్వం అనేది కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు మాత్రం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు.
మామూలుగా అయితే అన్ని రకాల వైరస్‌లు కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు అతిధేయ కణాల లోపల విపరీతమైన సంఖ్యలో ఉత్పత్తి అయి వ్యాప్తి చెందుతాయి. వాటిలో కొన్ని ఉత్పరివర్తనలు సహజ ఎంపిక ద్వారా కొనసాగుతాయి. కానీ, కరోనా వైరస్ పరివర్తన వేగం మాత్రం అంతగా లేదని చెబుతున్నారు నిపుణులు. కరోనా వైరస్ ఎక్కడ కనుగొన్నా.. దాని లక్షణాలు మాత్రం సిమిలర్‌గానే ఉన్నాయని చెబుతున్నారు. వైరస్‌లో భిన్నలక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు. సార్స్(SARS-CoV-2), కోవిడ్-19 వ్యాధికి కారణమైన ఈ వైరస్ గబ్బిలాల్లో వ్యాప్తి చెందుతున్న వైరస్‌ను పోలి ఉందని చెబుతున్నారు. ఈ వైరస్ గతేడాది చైనా దేశంలోని వూహన్‌లో గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించిందని తెలుస్తోంది.
పాంగోలిన్ అనే ఇంటర్మీడియట్ స్పెసీస్ ద్వారా ఇదంతా జరిగిందంటున్నారు శాస్త్రవేత్తలు. చీమలను ఆహారంగా తినే పాంగోలిన్ జంతు జాతులను చైనాలో ఎలాంటి అనుమతులు లేకుండా సంప్రదాయ మందులు తయారు చేసేందుకు ఉపయోగిస్తారట.
కోవిడ్-19 కట్టడికి శాస్త్రవేత్తల కృషి..
దాదాపు 1,000 రకాలకు పైగా కరోనా వైరస్ శాంపిల్స్‌పై అధ్యయనం చేస్తున్నట్లు జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ అప్లైడ్ పిజిక్స్ లాబోరేటరీలో పనిచేసే పరమాణు జన్యుశాస్త్రవేత్త పీటర్ థియేలెన్ తెలిపారు. చైనా, అమెరికాలో కరోనా వైరస్ లక్షణాలను పోలిస్తే వాటి జెనిటిక్స్‌లో కేవలం 4 నుంచి 10 లక్షణాల్లో మాత్రమే బేధం ఉందని చెప్పారు. వైరస్ అనేది చాలా తక్కువ పరివర్తనలతో పెద్ద సంఖ్యలో మనుషులపై ప్రభావం చూపింది కనుక.. ఈ సమయంలో వైరస్ పరివర్తన కోవిడ్ 19 వ్యాధి కోసం కేవలం ఒక్క వ్యాక్సిన్ తయారు చేస్తే చాలు అనే సజెస్ట్ చేస్తుందన్నారు. ఫ్లూ వైరస్ పరివర్తన వేగంగా ఉంటుంది కాబట్టి ఏటా కొత్తగా వ్యాక్సిన్ తయారు చేయాల్సి వస్తోందనీ, కాని కరోనా వైరస్‌కు సింగిల్ వ్యాక్సిన్ తయారు చేస్తే చాలు అని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ఎక్కువ కాలం రోగ నిరోధక శక్తిని అందించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కోవిడ్-19ను అరికట్టేందుకు వ్యాక్సిన్స్ తయారు చేయడంలో శాస్త్రవేత్తలు పగలు రాత్రులు నిమగ్నమయ్యారు. అయితే, వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు 12 నుంచి 18 నెలలు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు.
వైరస్ పరివర్తనలో మార్పులు..!
కరోనా వైరస్ ఇంటర్నేషనల్ కమిటీ సభ్యులైన వైరాలజిస్టులు స్టేన్లీ పెర్లామన్ (యూనివర్సిటీ ఆఫ్ ఐఓవా), బెంజామినన్ నెయిమన్ (టెక్సాస్ అండ్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీ) చెబుతున్న దాని ప్రకారం… ప్రస్తుతం కరోనా వైరస్ పరివర్తనలో గణనీయమైన మార్పులు కనిపించకపోయినా… ఏడాది కాలంలో కనిపించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌తో పోలిస్తే ఫ్లూ వైరస్‌లో ఒక లక్షణం చాలా ఎఫెక్ట్ చూపిస్తుందన్నారు. ఫ్లూ వైరస్లో ఉండే జీనోమ్స్ సిగ్మెంట్స్‌గా విడిపోతాయనీ, ఒక వేళ రెండు ఫ్లూ వైరస్‌లు ఒకే సెల్‌లో ఉన్నట్లైతే వాటి లక్షణాలు ఒకటికొకటి ఇచ్చిపుచ్చుకుని మరో కొత్త కాంబినేషన్ సృష్టించబడుతుందని తెలిపారు. అలా వచ్చిందే H1N1 స్వైన్ ఫ్లూ అని తెలిపారు. అంటే వైరస్ పరివర్తన అనేది దానికి వ్యాక్సిన్ కనుగొనడంలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుందనీ, ఎప్పటికప్పుడు కొత్త వ్యాక్సిన్ కనుగొనేందుకు దారి తీస్తుందన్నారు. కానీ, నోవెల్ కరోనా వైరస్‌లో అలాంటిదేమీ లేదన్నారు.
మరి ఇటలీలో అంతటి మరణమృందానికి కారణం ఏంటి? అంటే…. అక్కడి పరిస్థితుల ప్రభావమే అని నిపుణులు చెబుతున్నారు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండటం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆస్పత్రుల్లో పేషెంట్స్ సంఖ్య అధికంగా ఉండటం, తక్కువ సంఖ్యలో వెంటిలేటర్స్ కలిగి ఉండటం అనేవి చాలా ఎఫెక్ట్ చూపాయంటున్నారు. వైరస్ కారణంగానే కోవిడ్-19 వ్యాధి తీవ్రత, మరణాల సంఖ్య పెరిగిందని చెప్పలేమనీ, ఇతర కారణాలూ ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఈ ఏడాది ప్రారంభంలో ఒక టీంకు చెందిన శాస్త్రవేత్తలు కరోనా వైరస్ రెండు విభిన్న జాతులు సాధారణ వ్యాధి తీవ్రతను పెంచుతాయని చెప్పినా… ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది సైంటిఫిక్ కమ్యూనిటీ.
Tags: CoronaVirus, Covid19, Virus Mutation, Vaccine