ఫుల్ స్పీడుగా కరోనా

by vinod kumar |
ఫుల్ స్పీడుగా కరోనా
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ బుల్లెట్ రైలు స్పీడుతో వ్యాప్తి చెందుతోంది. కేవలం మూడ్రోజుల్లో దేశవ్యాప్తంగా కేసులు 60వేల నుంచి 70వేలు దాటాయి. మంగళవారం నమోదైన 3,604 కొత్త పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 70,756కు చేరుకుంది. ఏపీలో కొత్తగా 33కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,051కి చేరింది. 1,056 మంది డిశ్చార్జి అవగా 46మంది చనిపోయారు. మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 1,026 కొత్త కేసులు రికార్డవగా మొత్తం కేసుల సంఖ్య 24,427కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 53మంది కరోనాతో చనిపోగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 921కి వెళ్లింది. రాష్ట్ర రాజధాని ముంబైలో కొత్తగా 426 కేసులు నమోదవగా ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 14,781కి చేరింది. ముంబైలో మంగళవారం ఒక్కరోజే 28 మంది కరోనాతో చనిపోగా నగరంలో ఇప్పటివరకు 556 కరోనా మరణాలు నమోదయ్యాయి. తమిళనాడులో ఒక్కరోజే 716 కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 8,718కి చేరింది. మంగళవారం ఒక్కరోజే ఇక్కడ 8మంది కరోనాతో చనిపోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణాల సంఖ్య 61గా రికార్డైంది. ఢిల్లీలో మంగళవారం ఒక్క రోజే 406 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7,639కి చేరింది. ఇక్కడ ఒక్కరోజే వ్యాధి సోకి 13 మంది చనిపోగా ఇప్పటివరకు 86 మంది మరణించారు. గుజరాత్‌లో ఒక్కరోజే 362 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 8,904కు వెళ్లింది. ఇక్కడ ఇప్పటివరకు కరోనాతో 537 మంది చనిపోగా 3,246 మంది డిశ్చార్జి అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed