- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా దెబ్బకు పడిపోయిన రంగాలు!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో భారీ స్థాయిలో నష్టాలను చూశాయి. మార్కెట్ భారీగా పతనమవడంతో మెటల్ రంగం షేర్లు అత్యధికంగా క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా లోహాలను ఎగుమతి చేసే చైనాలో కరోనా వైరస్ కారణంగా ఉత్పత్తి ఆగిపోయింది. ఉత్పత్తి లేకపోవడంతో అంతర్జాతీయంగా మెటల్ షేర్లకు డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయంగా పడిపోవడంతో, దేశీయంగా కూడా మెటల్ రంగానికి నష్టాలు తప్పలేదు. మార్కెట్ల పతనంతో మెటల్ షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌లోనే 3.60 శాతం నష్టపోయాయి. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్‌లు గురువారం 2,612 వద్ద ముగిసిన తర్వాత సోమవారం 3 శాతం వరకూ నష్టపోయి 2,532.80 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జిందాల్ స్టీల్ అధికంగా 5 శాతం నష్టాన్ని చూసింది. హిందాల్‌కో 4.50 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4 శాతం, టాటా స్టీల్, హిందూస్తాన్ కాపర్, సెయిల్, వేదాంత సంస్థల షేర్లు 3.50 శాతం, నాల్కో, మెయిల్, కోల్ ఇండియా షేర్లు 3 శాతం వరకూ పడిపోయాయి.
ఆటో రంగం :
మరోవైపు ఆర్థిక మందగమనం కారణంగా ఇదివరకే నష్టాల్లో ఉన్న ఆటో రంగానికి ప్రస్తుత పరిస్థితులు మరింత దిగజార్చాయి. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ 2.30 శాతం దిగజారి 7,518 వద్ద ట్రేడవుతోంది. ఇందులో అశోక్ లేలాండ్ అధికంగా 1.72 శాతం పెరిగి రూ. 85.75 వద్ద కొనసాగుతోంది. టీవీఎస్ మోటార్స్ 2 శాతం తగ్గి రూ. 437.50 వద్ద ట్రేడవుతోంది. ఎమ్అండ్ఎమ్ 2 శాతం తగ్గి రూ. 515 వద్ద ట్రేడవుతోంది. ఎమ్ఆర్ఎఫ్ 2.53 శాతం క్షీణించి రూ. 69,000 వద్ద కొనసాగుతోంది. బజాజ్ ఆటో, అమర్‌రాజా బ్యాటరీస్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, మారుతీ సుజుకి షేర్లు 1 నుంచి 4 శాతం తగ్గాయి.
Read Also..