కరెంట్ లేక.. గాంధీలో పేషేంట్ల ఇబ్బందులు

by Anukaran |   ( Updated:2020-07-23 11:09:01.0  )
కరెంట్ లేక.. గాంధీలో పేషేంట్ల ఇబ్బందులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రెప్పపాటు కరెంటు పోతే వార్త… అని ముఖ్యమంత్రి పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలోని కరోనా వార్డులో ఏకంగా రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పేషెంట్లకు ఇబ్బదులు ఎదురయ్యాయి. చివరకు మంత్రి జోక్యం చేసుకుని అధికారులను మందలించిన తర్వాత దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది. గురువారం మధ్యాహ్నం తర్వాత రెండు గంటల పాటు కరెంట్‌ లేదన్న వార్త తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ వెంటిలేటర్లపై ఉన్న పేషెంట్లు పడుతున్న ఇబ్బందిని డాక్టర్లు, వైద్య సిబ్బంది ద్వారా తెలుసుకుని వెంటనే అక్కడ జనరేటర్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని కొవిడ్‌ ఆసుపత్రుల్లో జనరేటర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో విద్యుత్‌ పునరుద్ధరణ జరిగినప్పటికీ అన్ని కొవిడ్‌ ఆసుత్రుల్లో జనరేటర్ల పనితీరును పరీక్షించాలని అవసరమైన చోట అదనపు జనరేటర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed