- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. వచ్చే వారం నుంచి..
దిశ, సికింద్రాబాద్ : జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు వచ్చే వారంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (టిడబ్ల్యుజెఎఫ్) అధ్యక్షులు ఇ.చంద్రశేఖర్, కార్యదర్శి కె. నిరంజన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం కోఠిలోని కార్యాలయంలో డీహెచ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డీహెచ్ మాట్లాడుతూ.. జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించిందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా వచ్చే వారం జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని హెచ్‌యూజే ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. కరోనా బారినుంచి జర్నలిస్టులను కాపాడటానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నందుకు హెచ్‌యూజే తరుఫున డీహెచ్ శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు.