చీకటి గదిలో ఆ పని చేస్తున్న వైద్య సిబ్బంది.. అధికారులు ఏం చేస్తున్నారు..?

by Shyam |
చీకటి గదిలో ఆ పని చేస్తున్న వైద్య సిబ్బంది.. అధికారులు ఏం చేస్తున్నారు..?
X

దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ చీకటి గదిలోనే నడుస్తోంది. జిల్లా వైద్య అధికారుల అలసత్వం కారణంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ ను వెలుతురు గది నుండి చీకటి గదిలోకి మార్చడంతో లబ్ధిదారులు, ప్రజలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య సిబ్బంది టార్చ్ లైట్ సాయంతో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. చీకటి గదిలోకి మార్చి నెలరోజులు కావస్తున్నా అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో కరోనా వ్యాక్సిన్ ఇచ్చే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారులు స్పందించి వెంటనే టీకా సెంటర్ ను వెలుతురు ఉన్న ప్రాంతానికి మార్చాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed