- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెండ్‌కు తగ్గ పేరు.. ‘లాక్‌డౌన్ యాదవ్’
కొంతమంది పేర్లు విచిత్రంగా ఉంటాయి. మరికొందరి పేర్ల వెనక పెద్ద కథే ఉంటుంది. ముఖ్యంగా వారు పుట్టిన సమయంలో కొనసాగుతున్న ట్రెండ్‌ను బట్టి తల్లిదండ్రులు వారి పిల్లలకు పేర్లు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్ కరోనా.. దీని పుణ్యమా అని క్వారంటైన్, లాక్‌డౌన్, శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ వంటి పదాలు బాగా వాడుకలోకి వచ్చాయి. ఇంకేం.. ఇప్పుడు పుడుతున్న పిల్లలకు క్యాచీ పేర్లు దొరికేశాయి. మానవాళి మొదటిసారిగా ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితిని తమ పిల్లలకు పేరు పెట్టి గుర్తుంచుకోవాలని ఓ ఉత్తరప్రదేశ్ జంట నిర్ణయించుకుంది.
ముంబైలో ఉంటున్న ఉదయభాన్ సింగ్, రీనా దంపతులు శ్రామిక్ స్పెషల్ రైలులో ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామానికి బయలుదేరారు. శుక్రవారం రాత్రి సమయంలో నెలలు నిండిన రీనాకు పురిటి నొప్పులు ప్రారంభం కాగా, సాయం చేయాలంటూ ఉదయభాన్ సింగ్, రైల్వే హెల్ప్ లైన్‌కు ఫోన్ చేశారు. వారు వెంటనే స్పందించి రైలును బుర్హాన్‌పూర్‌లో ఆపారు. అక్కడి నుంచి ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ రీనా మగ బిడ్డకు జన్మనిచ్చింది. లాక్‌డౌన్ సమయంలో పుట్టినందున అతనికి ‘లాక్‌డౌన్ యాదవ్’ అని పేరు పెట్టారు. పేరు చాలా బాగుంది కదూ!