ముంబై తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా

by vinod kumar |   ( Updated:2020-04-11 21:16:17.0  )
ముంబై తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా
X

ముంబాయిలోని కొలాబా ప్రాంతాల్లో ఉన్న తాజ్ మహల్ ప్యాలెస్, తాజ్ టవర్స్ హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా సోకడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ హోటళ్లలో ఇళ్లకు దూరంగా ఉండి కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లు బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ సిబ్బందికి కరోనా సోకడంతో వైద్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎంత మందికి వైరస్ సోకిందన్న విషయాన్ని మాత్రం ఐహెచ్సీ సంస్థ స్పష్టం చేయలేదు. చాలా మంది సిబ్బందికి కరోనా సోకినట్టు తేలినా, వ్యాధి లక్షణాలు మాత్రం కనిపించలేదని పేర్కొంది. కాగా, బాంద్రా ప్రాంతంలో తాజ్ లాండ్, కుఫ్పీ పరేడ్ ప్రాంతంలో వివాంతా ప్రెసిడెంట్, తాజ్ శాంతాక్రజ్ హోటళ్లను ఐహెచ్సీ నిర్వహిస్తోంది. కరోనా సోకిన తాజ్ హోటల్ ఉద్యోగులను బాంబే హాస్పిటల్‌లో చికిత్స జరుగుతోందని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి కన్సల్టింగ్ ఫిజీషియన్ గౌతమ్ భన్సాలీ వెల్లడించారు.

Tags: mumbai, taj hotel, employee, corona, positive cases

Advertisement

Next Story

Most Viewed