కురిచేడు మృతుల్లో నలుగురికి కరోనా

by Anukaran |
కురిచేడు మృతుల్లో నలుగురికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కురిచేడు ఘటనలో మృతుల సంఖ్య 12 కు చేరింది. రెండు రోజుల వ్యవధిలో శానిటైజర్ తాగి 10 మంది మృతిచెందారు. నేడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. మద్యం దొరకకపోవడంతో వీరు నెలరోజులుగా శానిటైజర్ తాగినట్టు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

మరోవైపు మృతుల్లో నలుగురికి కరోనా సోకింది. దీంతో వారి అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు సీరియస్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story