మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

by Anukaran |
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: యావత్ దేశాన్ని కరోనా వైరస్ కాకవికలం చేస్తోంది. సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ వ్యక్తి వరకు ఇలా ఎవ్వరినీ కూడా అది వదలడంలేదు. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా టెస్టుల్లో ముఖర్జీకి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో హైం హైసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తనతో కాంటాక్టులో ఉన్నవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Advertisement

Next Story