వరంగల్‌లో ఐదుగురు జర్నలిస్టులకు కరోనా

by vinod kumar |   ( Updated:2020-06-23 23:10:34.0  )
వరంగల్‌లో ఐదుగురు జర్నలిస్టులకు కరోనా
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ లో ఐదుగురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు వైద్యులు ధృవీకరించారు. నాలుగు రోజులుగా వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రోజుకు 25 మందికి చొప్పున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాల్లో పరీక్షలు చేయించుకున్న జర్నలిస్టులకు నెగెటివ్ రాగా సోమవారం పరీక్షలు చేయించుకున్న వారిలో ఐదుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు, ఈ మేరకు వారిని హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.

Advertisement

Next Story