నాకు కరోనా సోకింది: మాజీ ముఖ్యమంత్రి

by Anukaran |
నాకు కరోనా సోకింది: మాజీ ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: అసోం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ కి కరోనా సోకింది. గతకొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా టెస్టుల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని గొగోయే స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. తనకు కరోనా సోకిందని, తనతో కాంటాక్టు అయినవారు కరోనా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, అసోంలో గత కొద్ది రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed