PBJJBY : కరోనా వేళ.. పీఎంజేజేబీవైలో చేరుదాం

by Shamantha N |   ( Updated:2021-05-28 03:39:10.0  )
PBJJBY :  కరోనా వేళ.. పీఎంజేజేబీవైలో చేరుదాం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కొవిడ్-19 అల్లకల్లోలం సృష్టిస్తున్నది. వైరస్ బారినపడి ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. ఎంతో మంది పిల్లలు అనాథలు అవుతున్నారు. ఆర్థిక చేయూత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమ యోజన కొంత ఉపశమనం కలిగిస్తున్నది. పాలసీ తీసుకున్న వ్యక్తి ఏ విధంగా మృతిచెందినా (కరోనాతో మృతిచెందినా సరే) ఈ స్కీమ్ కింద రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తారు. ఆదాయంతో సంబంధం లేకుండా ఎవరైనా పాలసీ తీసుకోవచ్చు. కేవలం బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది.

స్కీమ్: పీఎంజేజేబీవైవయస్సు: 18 నుంచి 55ఏండ్లు
ప్రీమియం: 330
ప్రారంభం: జూన్ 1 నుంచి
టర్మ్ పిరియడ్: జూన్ 1 నుంచి మే 31 (ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకోవాలి)
వర్తింపు: పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాత
పరిహారం: రూ.2లక్షలు. ఒక వ్యక్తి ఒకే పాలసీ తీసుకోవడానికి అర్హులు

ప్రభుత్వరంగ బ్యాంకులు

బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇన్సూరెన్స్ కంపెనీలు

లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు

ఆర్థిక సంస్థలు

ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎక్సిమ్ బ్యాంక్), స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఐడీబీఐ), నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నాబార్డ్, ఐఐఎఫ్‌సీఎల్, ఐఎఫ్‌సీఐ

Advertisement

Next Story