పాలమూరులో కరోనా టెస్టింగ్ ల్యాబ్: మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్

by Shyam |

దిశ, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో త్వరలో ఆధునిక కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మొదట్లో కరోనా వైరస్ టెస్టుల కోసం పుణెలోని నేషనల్ ల్యాబ్‌కు నమూనాలు పంపేవారని, ముఖ్యమంత్రి కృషి వల్ల ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆధునిక ల్యాబ్‌ ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో 10 నుంచి 15 రోజుల్లో మహబుబ్‌నగర్ జిల్లాలో ఆధునిక కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఈ ల్యాబ్‌లో 24 గంటల్లో ఫలితాలు వెలువడుతాయన్నారు. రోజుకు 120 నుంచి 150 వరకు కరోనా పరీక్షలకు అవకాశం ఉంటుందన్నారు.
Tags;Minister v.srinivs goud,corona testing lab,Mahabubnagar

Advertisement

Next Story