కరోనా లక్షణాలతో వృద్ధుడి మృతి

by vinod kumar |
కరోనా లక్షణాలతో వృద్ధుడి మృతి
X

దిశ ప్రతినిధి, మెదక్: కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో సిద్దిపేటకు చెందిన ఓ వృద్ధుడు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. వృద్ధుడి శాంపిల్స్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. ఈ క్రమంలో వృద్ధుడు గురువారం మృతి చెందాడు. అతని కుమారుడు మృతదేహాన్ని తీసుకెళ్ళకుండా వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story