- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా పాట పాడి.. అదే జబ్బుకు బలి..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్నే కకావికలం చేస్తున్న కరోనా వైరస్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్లపై ఎస్పీ బాలు పాడిన ‘భరత్ భూమి’ వీడియో పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చినా చివరకు అదే వైరస్‌కు బలయ్యారు. దేశవ్యాప్తంగా వైద్యులు, పోలీసులు, పారిశుద్య కార్మికులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడుతూ సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక వీడియో పాటకు ప్లాన్ చేశారు. కరోనా పేషెంట్లకు నిస్వార్థంగా సేవచేస్తున్న వీరి అంకితభావాన్ని ప్రశంసించి ప్రజల్లో స్ఫూర్తి కలిగించడం ఈ వీడియో పాట ఉద్దేశం. తమిళం, హిందీ భాషల్లో రూపొందించిన ఆ పాటకు గాత్రాన్ని సమకూర్చి ‘యూట్యూబ్’ ద్వారా మే నెల 30న ఇళయరాజా చేతుల మీదుగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. చివరకు మూడు నెలల తర్వాత అదే కరోనా వైరస్‌కు ప్రాణాలు కోల్పోయారు. ఏ వైద్య సిబ్బంది కృషిని కొనియాడారో వారి చేతుల్లోనే తుది శ్వాస వదిలారు.
Read Also…