- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా విలయతాండవం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 53, 681మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 7,813 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88, 671కి చేరింది. ఇవాళ 52 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 985కి చేరింది. గుంటూరు జిల్లాలో 9, పశ్చిమ గోదావరి జిల్లాలో 8, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలులో ఆరు చొప్పున చిత్తూరు 5, విజయనగరం జిల్లాలో 4 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి.
ఇవాళ అనంతపురం జిల్లాలో 723 పాజిటివ్ కేసులు రాగా చిత్తూరు 300, తూర్పుగోదావరి 1,324, గుంటూరు 656, కడప 294, కృష్ణా 407, కర్నూలు 742, నెల్లూరు 299, ప్రకాశం 248, విశాఖ 936, విజయనగరం 523, పశ్చిమ గోదావరి జిల్లా 1,012, శ్రీకాకుళం జిల్లాలో 349 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 44,431 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స తీసుకొని 43,255మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15లక్షల 95వేల 674మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.