- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పాజిటివ్ అనగానే ప్రభుత్వం చేసే పని ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు దాదాపు 8000లకు చేరువలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ అని ఒక వ్యక్తిని గుర్తించగానే ప్రభుత్వం అనుసరించే విధానాలు, చేసే పనుల గురించి కూలంకషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా కరోనా పాజిటివ్ అనే విషయం జిల్లా మేజిస్ట్రేట్‌కి వైద్య సిబ్బంది తెలియజేస్తారు. ఆ తర్వాతే వాళ్లు పాజిటివ్ కేసుగా అధికారికంగా ముద్ర వేస్తారు. అలా ముద్ర వేసిన వెంటనే ప్రభుత్వ అధికారులు కొన్ని ముఖ్యమైన పనులు వరుసగా చేస్తారు.
పాజిటివ్ అని తెలియగానే కాంటాక్టు ట్రేసింగ్ టీమ్ రంగంలోకి దిగుతుంది. గత 15 రోజుల కదలికలను వ్యాధిగ్రస్తుడిని అడిగి తెలుసుకుంటుంది. ఎవరిని కలిశారు? ఎంతమందిని, ఎంతసేపు, ఎక్కడ కలిశారు? ఎలా వెళ్లారు? ఎక్కడెక్కడ తిరిగారు? ఏదన్నా వేడుకలకు వెళ్లారా? వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబడుతుంది. ఒకవైపు ఇది కొనసాగుతుండగా పోలీసులు, మెడికల్ సిబ్బందితో కూడిన మరో బృందం బాధితుడు నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి క్వారంటైన్ చేస్తుంది. అతని ఇంటికి కనీసం 2 కి.మీ.ల మేర ప్రాంతాన్ని లాక్‌డౌన్ చేసి ఇంటింటికి వివరాలు తీసుకుంటారు.
తర్వాత పేషెంటుతో గత 15 రోజుల్లో దగ్గరగా తిరిగిన వారిని, పేషెంటు కుటుంబ సభ్యులను టెస్టు కోసం పంపిస్తారు. టెస్టు ఫలితాలు నెగెటివ్ అని తేలే వరకు వారిని అక్కడే ఆసుపత్రిలో ఉంచుతారు. తర్వాత పేషెంటు కుటుంబం నివసించే ప్రాంతంలో చుట్టుపక్కల ఇళ్లలో ఇంటింటికి తిరిగి ప్రాథమిక లక్షణాలు తెలిపే టెస్టు చేస్తారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే కరోనా టెస్టుకి పంపిస్తారు. అన్ని ఇళ్లలో సర్వే నిర్వహించి వెంటనే ఆరోగ్య విషయాలు తెలుసుకుంటారు. తర్వాత పారిశుద్ధ సిబ్బంది ఆ ప్రాంతాన్ని మొత్తం సోడియం హైపోక్లోరేట్ ద్రావణంతో ప్రతి అంగుళాన్ని శానిటైజ్ చేస్తారు. చివరగా ఆ ప్రాంతంలో నివసించే వారందరినీ లాక్‌డౌన్ చేసి, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం గురించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి, తర్వాతి ఉదయం నుంచి సరుకులు అందజేస్తారు.
Tags -Lockdown, Corona positive, Home Quarantine, Government