నారాయణపేట జిల్లాలో 4 నెలల పసికందుకు..

by Shyam |
నారాయణపేట జిల్లాలో 4 నెలల పసికందుకు..
X

దిశ, మహబూబ్ నగర్: నారాయణపేట జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 4 నెలల పసికందుకు కోవిడ్-19 నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మక్తల్ మండలం జెక్లెర్ గ్రామానికి చెందిన 4 నెలల పసికందు దగ్గుతో బాధపడుతుండగా తల్లిదండ్రులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్, తరువాత హైదారాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం వైద్యులు పరీక్షించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ పసికందు కుటుంబం రెండు రోజుల క్రితం ముంబాయి నుంచి వలస వచ్చింది. కాగా, గతంలో కూడా నారాయణపేట జిల్లాలో రెండు నెలల పసికందుకు కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story