గాంధీలో కరోనా ట్రీట్‌ మెంట్‌కు జ్వరం మాత్రలు

by vinod kumar |
గాంధీలో కరోనా ట్రీట్‌ మెంట్‌కు జ్వరం మాత్రలు
X

దిశ, ఖమ్మం :
కరోనా పాజిటివ్ వచ్చిందని హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో చేరిన తనకు ఎలాంటి వైద్యం అందడం లేదని కొత్తగూడెంకు చెందిన యువతి ఆరోపించింది. నాలుగు రోజుల కిందట కొత్తగూడెం జిల్లా కేద్రంలోని ఇందిరా ప్రియదర్శిని ప్రాంతానికి చెందిన యువతికి పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.అయితే తనకు మూడు పుటలా భోజనం, ఏవో జ్వరం తగ్గడానికి మందులు వాడాలని ఇక్కడి వైద్య సిబ్బంది సూచించారని చెబుతోంది. ఈ విషయాన్ని మీడియాకు, కుటుంబ సభ్యులకు వీడియో కాల్ ద్వారా తెలిపింది. కరోనా పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేకపోవడంతో ఇంటికి వెళ్లాలని వైద్య సిబ్బంది, వైద్యులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందాలని చెబుతున్నారని వివరించింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తనను ఇంటికి రావొద్దని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఎలాంటి వైద్యం చేయనపుడు గాంధీ హాస్పిటల్‌కు ఎందుకు తీసుకువస్తున్నారని ఆ యువతి ప్రశ్నించింది.

Advertisement

Next Story