జనగామలో మరో ముగ్గురికి కరోనా

by vinod kumar |
జనగామలో మరో ముగ్గురికి కరోనా
X

దిశ, జనగామ: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. తాజాగా జనగామ‌ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమానికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనతో సంబంధంగా ఉన్న వారికి వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించగా బుధవారం మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి.‌ ఈ రోజు మరికొంతమందికి టెస్టులు‌ నిర్వహించగా మరో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి మహేందర్ తెలిపారు. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 20 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో ఒకరు మృతి చెందగా 10 మంది డిశ్చార్జి అయ్యారు. 667మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు జిల్లా వైద్య బృందం గురువారం సాయంత్రం మీడియా బులెటిన్ ద్వారా వెల్లడించారు.

Advertisement

Next Story