టాలీవుడ్‌లో కరోనా పంజా.. స్టార్ డైరెక్టర్‌కు పాజిటివ్

by vinod kumar |
director Anil Ravipudi
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ అనేకమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యుసర్లు, హీరోయిన్లు కరోనా బారినపడుతున్నారు. దీంతో ఇప్పటికే పలు సినిమాల షూటింగ్‌లు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ఆయన చేస్తున్న ‘ఎఫ్ 2’ మూవీ షూటింగ్‌కి బ్రేక్ పడింది. కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ షూటింగ్‌లు వాయిదా పడగా, ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సోనూసూద్‌కు నిన్న కరోనా సోకిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed