- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో ఆరుగురికి కరోనా!
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరికొందరు కరోనా బారిన పడ్డారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిలో ఆరుగురికి కొత్తగా వైరస్ సోకినట్టు సమాచారం. వారంరోజుల క్రితమే టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సెక్షన్‌లో పనిచేస్తున్న కొందరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో ఆయా ఫ్లోర్లలో శానిటైజేషన్ చేయడంతో పాటు సందర్శకుల రాకపోకలపై నియంత్రణ విధించారు. తాజాగా ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న మరికొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. హౌజింగ్ విభాగంలో ముగ్గురు, ఫైనాన్స్ విభాగంలో ఒకరికి, స్టాటిస్టిక్స్, హెల్త్ విభాగాల్లో కలిపి మొత్తం ఆరుగురికి కరోనా సోకింది.
అయితే కొత్త కరోనా కేసులను బల్దియా అధికారిక వర్గాలు ధృవీకరించడం లేదు. గ్రేటర్ ప్రజలకు సేవలందించే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. వాటిపై రహస్యంగా వ్యవహరించడం వివాదస్పదంగా మారుతోంది. ప్రజలు తమ పనుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వస్తుంటారు. అధికారులు, సిబ్బంది కూడా సాధారణ పద్ధతుల్లో రోజూ వారీ డ్యూటీలు చేస్తుంటారు. కార్యాలయంలో వైరస్ తీవ్రత పెరిగిందనే విషయం వారి దృష్టిలో ఉంటే తగిన జాగ్రతలు తీసుకునేందుకు అవకాశం కలిగి అప్రమత్తంగా ఉంటారు. అయితే బల్దియా ఉన్నతాధికారులు కరోనా కేసులను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎవరిలో కరోనా ఉందో తెలియక, తమకు కరోనా అంటుకుంటుందేమోనని ప్రధాన కార్యాలయంలోని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.