మున్సిపల్ కమిషనర్‌కు కరోనా.. ఆఫీసు సిబ్బందిలో టెన్షన్

by Shyam |   ( Updated:2021-11-22 06:06:30.0  )
మున్సిపల్ కమిషనర్‌కు కరోనా.. ఆఫీసు సిబ్బందిలో టెన్షన్
X

దిశ, చిట్యాల : చిట్యాల మున్సిపల్ కమిషనర్ ఎం. రామదుర్గా రెడ్డి కరోనాబారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, కొద్ది రోజుల క్రితం బంధువుల శుభకార్యానికి హాజరైన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. జలుబు, జ్వరం, తలనొప్పి ఉండటంతో అనుమానం వచ్చి శనివారం చిట్యాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. ఈ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన సోమవారం నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. పదిహేను రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండగా మున్సిపల్ కమిషనర్ ఇన్చార్జి బాధ్యతలను ఇంకా ఎవరికీ ఇవ్వలేదు.

సిబ్బందిలో కలవరం..

మున్సిపల్ కమిషనర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు, ముగ్గురు సిబ్బంది కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story