మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్

by Anukaran |
మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ అనేక మంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలలోనే ఉన్నారు. ఈనెల 25వ తేదీన విజయవాడకు చేరుకున్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రికి పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మంత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రి చేరి, చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed