తమన్నాకు కరోనా పాజిటివ్

by Anukaran |   ( Updated:2020-12-02 00:37:18.0  )
తమన్నాకు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ ప్రజాప్రతినిధులో పాటు, అనేక మంది సెలబ్రెటీలు మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు హీరోయిన్ తమన్నాకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. గతకొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తమన్నా భాటియా చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరింది. ఇటీవలే తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకడంతో అనుమానం వచ్చిన వైద్యులు ఆమెకు పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చింది. కాగా తమన్నా తల్లిదండ్రులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

Advertisement

Next Story