హార్వీ వీన్‌స్టెయిన్‌కి కరోనా పాజిటివ్

by vinod kumar |
హార్వీ వీన్‌స్టెయిన్‌కి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక దాడి, రేప్ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న హాలీవుడ్ మాజీ సినీ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్‌కి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వెండే కరెక్షషనల్ ఫెసిలిటీలోని ఐసోలేషన్ వార్డులో ప్రస్తుతం హార్వీని ఉంచినట్లు న్యూయార్క్ స్టేట్ కరెక్షనల్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ మైకేల్ పవర్స్ వెల్లడించారు. ఆదివారం రోజున హార్వీకి చేసిన పరీక్ష పాజిటివ్ అని తేలిన తర్వాత సరిపడ పరికరాలు లేని కారణంగా సిబ్బందిని మొత్తం క్వారంటైన్ చేసినట్లు పవర్స్ చెప్పారు.

అయితే హార్వీ తరఫు న్యాయవాదులకు ఈ విషయం ఇంకా తెలియజేయలేదని రాయిటర్స్ పత్రిక తెలిపింది. హార్వీతో పాటు అదే ఫెసిలిటీలో ఉంటున్న మరో వ్యక్తి కూడా కరోనా పాజిటివ్ సోకినట్లు సమాచారం. మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమీ హేలేయి మీద లైంగిక దాడి, నటి జెస్సికా మాన్ మీద రేప్ కేసుల్లో మార్చి 11న హార్వీకి 23 ఏళ్ల పాటు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story