ఊర్లోకి ఆమెకు నో ఎంట్రీ.. అడవిలోనే ఇంటర్ విద్యార్థిని నివాసం

by Aamani |
ఊర్లోకి  ఆమెకు నో ఎంట్రీ.. అడవిలోనే ఇంటర్ విద్యార్థిని నివాసం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల తెలంగాణలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది విద్యార్థలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సోన్ దేవి గురుకులంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి కరోనా సోకడంతో బాలికను గ్రామంలోకి అనుమతించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయితీ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. సాలెగూడకు చెందిన మాధవి సోన్ దేవి గురుకులంలో ఇంటర్ చదువుతుంది. అయితే తనకు కరోనా సోకడంతో తాను తన గ్రామానికి పయనమైంది. బాలికకు కరోనా సోకిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాలికను గ్రామంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేది ఏమిలేక తన కుటుంబ సభ్యలు గ్రామ చివర్లో తమ పొలంలో చిన్న గుడారం వేసి అక్కడే ఐసోలేషన్ లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్ గురుకులం ఆర్ సీవో గంగాధర్ గ్రామనికి వచ్చి బాలికను ఊరిలోకి అనుమతించాలని గ్రామపెద్దలను కోరారు కానీ దానికి గ్రామస్తులు ఒప్పుకోలేదు.

Advertisement

Next Story

Most Viewed