లాక్‌డౌన్ కట్టుదిట్టం చేయండి : మంత్రి జగదీశ్ రెడ్డి

by Shyam |
లాక్‌డౌన్ కట్టుదిట్టం చేయండి  : మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, న‌ల్ల‌గొండ‌: తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో లాక్‌డౌన్ ను కఠినతరం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. పరిస్థితులు చేయిదాటి పోతున్నాయని కావున, లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలు సంచరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా అనుమానితులు స్వచ్చందంగా చికిత్స చేయించుకునేందుకు ముందుకు రావాలని పిలపునిచ్చారు. ఆయా కాలనీల్లో నివసించే వారికి కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నేపథ్యంలో వలస కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీఏవీ రంగనాథ్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ సివిల్ సప్లయ్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags: corona, lockdown, positive cases, review by minister jagadish

Advertisement

Next Story

Most Viewed