- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో ఏడు, మిర్యాలగూడలో ఒక పాజిటివ్ కేసు నమోదు
దిశ, నిజామాబాద్, మిర్యాలగూడ: నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆరు కేసులు పాజిటివ్ రాగా, సిరికొండ మండలం కొండాపూర్‌లో ఒక కేసు నిర్ధారణ అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 108కి చేరింది. నగరంలోని వినాయక్‌నగర్, గౌతం నగర్‌లలో ఒక్కొక్కటి చొప్పున, దేవి రోడ్ ప్రాంతానికి చెందిన నాలుగురికి పాజిటివ్ కేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. దీంతో వారు ఎవరెవరికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్నారో గుర్తించి, వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
మిర్యాలగూడ పట్టణంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నందిపాడు రోడ్డులో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారి వివరాలను వైద్యసిబ్బంది సేకరిస్తున్నారు. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.