- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగు రోజుల్లో 44 మంది మృతి
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఈ నెలలో మొదటి నాలుగు రోజుల్లోనే ఆరు వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లో కలిపి 44మంది మృతి చెందారు. ఇవన్నీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తున్న వివరాలు మాత్రమే. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంతమంది చనిపోతున్నారో వివరాలు తెలియజేయడానికి మంత్రి కూడా సానుకూలంగా స్పందించలేదు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచుతున్నా పాజిటివ్ కేసులు కూడా సగటున పది శాతం చొప్పున నమోదవుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నట్లు గణాంకాల్లో కనిపిస్తున్నా జిల్లాల్లో మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి.
గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 13,787 పరీక్షలు చేస్తే అందులో ఇంకా 919 పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. రిపోర్టు వచ్చిన పరీక్షల్లో 1,286 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 68,946కు చేరుకుంది. కరోనా కారణంగా మృతిచెందినవారి సంఖ్య 563కు చేరుకుంది. ఈ నెల 1వ తేదీన వెలువరించిన బులెటిన్‌లో 11మంది, 2వ తేదీన 10 మంది, 3వ తేదీన 11 మంది, 4వ తేదీన 12 మంది చొప్పున కరోనా కారణంగా మృతిచెందారు. 49,675 మంది డిశ్చార్జి కాగా ఇంకా 18,708 మంది యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లుగా ఉన్నారు.