- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో విజృంభిస్తున్న కరోనా
దిశ, ఏపీబ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడచిన 24గంటల్లో 98మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం ఏపీలో కరోనా కేసుల సంఖ్య 3,377కి చేరుకోగా వివిధ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 1,033 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2,273 మంది డిశ్చార్జ్ అయ్యారని, మరో 71 మంది మృత్యువాత పడ్డారని ప్రకటించింది. మరోవైపు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఏపీ నాలుగు లక్షల మార్కును అధిగమించినట్టు తెలిపింది. బుధవారం ఉదయానికి ఏపీలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 4,03,747కు చేరిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ లెక్కన ప్రతి పది లక్షల జనాభాలో 7,561 మందికి పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. దీంతో దేశంలోనే అన్ని రాష్ట్రాలల్లోకెళ్లా అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.