- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో లక్షా 30వేలు దాటిన కరోనా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం ఆగడం లేదు. గత కొద్దిరోజులుగా వేల సంఖ్యలో వస్తున్నా కేసులు వరుసగా రెండ్రోజుల నుంచి 10వేలకు మించి నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 70,068 మందికి పరీక్షలు నిర్వహించగా 10,167 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 30వేల 557కి చేరినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది. ఇవాళ 68 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,281కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో 9, గుంటూరు 9, అనంతపురం 8, కర్నూలు 8, విశాఖ 8, చిత్తూరు 6, కడప 6, ప్రకాశం, 4, విజయనగంరం 4, కృష్ణా 3, నెల్లూరు, శ్రీకాకుళం, ప.గో జిల్లాలో ఒక్కో కరోనా మరణం నమోదు అయ్యింది.
ఇవాళ అనంతపురంలో 954 కరోనా పాజిటివ్ కేసులు రాగా, చిత్తూరు 509, తూర్పుగోదావరి జిల్లాలో 1,441 , గుంటూరు 946, కడప 753, కృష్ణా 271, కర్నూలు 1,252, నెల్లూరు 702, ప్రకాశం 318, శ్రీకాకుళం 586, విశాఖపట్నం 1,223, విజయనగరం 214, పశ్చిమగోదావరి జిల్లాలో 998 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 69,234 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 57,147మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 18లక్షల 90,077 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.