- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా @ 1717
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తారస్థాయికి చేరుతోంది. ఏరోజుకారోజు పాజిటివ్ కేసుల సంఖ్యను పెంచుకుంటూ అగ్రస్థానం దిశగా సాగిపోతోంది. నిన్న, ఈ రోజు కూడా 67 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. దీంతో ఏపీలో ప్రస్తుతం 1717 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మెజారిటీ కేసులు రెడ్ జోన్‌లో గల ఐదు జిల్లాలకు పరిమితవ్వడం విశేషం.
ఏపీలో కర్నూలు జిల్లా కరోనా కేసులకి రాజధానిగా మారింది. పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ జిల్లా వాసులను కరోనా భయభ్రాంతులకు గురి చేస్తోంది. 25 కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలు అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 516కి చేరుకుంది. ప్రస్తుతం ఈ జిల్లాలో 516 మందికి కరోనా సోకితే 392 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 114 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 10 మంది మృత్యువాత పడ్డారు.
గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 13 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో 351 కేసులు నమోదయ్యాయి. 128 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయితే 215 మంది చికిత్స పొందుతున్నారు. 8 మంది మరణించారు.
కృష్ణా జిల్లాలో కూడా కరోనా కట్టడి కావడం లేదు. ఇక్కడ 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 286కి చేరుకుంది. 221 మంది చికిత్స పొందుతుంటే, 56 మంది కోలుకున్నారు. 9 మంది మరణించారు.
అనంతపురంలో 2, కడపలో 2, విశాఖపట్టణంలో 2, కర్నూలు జిల్లాలో 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,717కి చేరుకుంది. వారిలో ఇప్పటివరకు 589 మంది డిశ్చార్జ్ కాగా, 34 మంది మరణించారు. 1,094 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 1,33,492 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Tags: coronavirus, corona positive, covid-19, corona in ap, ap health department, 1717 positive cases