దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే?

by Anukaran |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని నెలల క్రితం యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. మహమ్మారి దెబ్బకు దేశ ప్రధానితో పాటు సామాన్యులకు కూడా కంటిమీద కునుకులేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. కరోనా బారినుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లో చాపకింద నీరులా మళ్లీ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 20,799 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి 180 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2.64 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 90.79 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. కేసులు మళ్లీ పెరుగుతుండటంతో జనాల్లో ఆందోళన మొదలైంది.

Advertisement

Next Story