రాష్ట్రంలో తగ్గుముఖం దిశగా కరోనా

by Anukaran |   ( Updated:2020-11-17 00:25:20.0  )
రాష్ట్రంలో తగ్గుముఖం దిశగా కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణతో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 952 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,58,828కి చేరింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,410కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 13,732 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా వైరస్ బారినుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 2,43,686 కి చేరింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 150 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 49,29,974 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఫలితంగా రికవరీ రేటు మరింత పెరిగింది.

Advertisement

Next Story