- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఐసోలేషన్ వార్డు.. వెరీ డర్టీ
హైదరాబాద్‌లోని కోరంటి ఫీవర్ హాస్పిటల్‌లో ఐసోలేషన్ వార్డు చాలా మురికిగా ఉందని, అందులో ఉండటం కంటే చావడం మేలని కరోనా పాజిటివ్ బాధితురాలు ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో స్పందించిన అధికారులు ఆమెను చెస్ట్ హాస్పిటల్‌లోని మరో వార్డుకు షిఫ్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెను ఫీవర్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే అక్కడంతా మురికిగా, వాసన వెదజల్లడం, కనీస సౌకర్యాలు లేవని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వీడియో తీసి పోస్టు చేసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెల్లడంతో వారు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే అసలే ప్రాణాంతక వైరస్ బాధపడుతున్న వారిని అలాంటి చోట ఉంచుతారా అని పలువురు విమర్శిస్తున్నారు.
Tags : hyd, corona, isolation ward very dirty, video on social media,fever hospital