- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది చివరకు మార్కెట్‌లోకి కరోనా వాక్సిన్
దిశ, న్యూస్ బ్యూరో: ఈ ఏడాది చివరికల్లా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. భారత్ బయోటెక్ సంస్థకు మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ఐసీఎంఆర్ అనుమతి మంజూరు చేసినందున త్వరలోనే ఇవి ప్రారంభమవుతాయని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ ఎల్లా కృష్ణ జాతీయ మీడియాకు వెల్లడించారు. సాధారణంగా ఒక వ్యాక్సీన్ తయారుచేయడానికి కనీసంగా పన్నెండేళ్ళు పడుతుందని, ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో చాలా వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. 1వ, 2వ దశల క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి వచ్చినందున కనీసంగా 1200 మంది వాలంటీర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత వీరికి కరోనా లేదనే నిర్ధారణ జరగాల్సి ఉందని, అప్పుడు వారిమీద వాక్సిన్‌ను రెండు డోసులలో ప్రయోగించి చూడాల్సి ఉంటుందని వివరించారు. దేశంలోని పది వేర్వేరు ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని, రెండు డోసుల తర్వాత పూణెలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో సీరాలజీ అధ్యయనం జరగాల్సి ఉంటుందని తెలిపారు.
రెండవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో కూడా దీన్ని పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ రెండు ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలతో ఐసీఎంఆర్ సంతృప్తి చెందినట్లయితే మూడవ దశ అవసరం లేకుండా లీగల్ ప్రొసీజర్‌కు అనుమతి ఇస్తే నేరుగా మార్కెట్‌లోకి వెళ్ళవచ్చని తెలిపారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం డిసెంబరు నాటికి ట్రయల్స్, లీగల్ అనుమతుల ప్రక్రియ పూర్తయ్యి మార్కెట్‌లోకి వ్యాక్సిన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. మూడవ దశ ట్రయల్స్ ఆ వ్యాక్సిన్ ఎంత సమర్ధవంతంగా పనిచేస్తుందో, ఎన్ని రోజుల్లో ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోడానికి వీలవుతుందని తెలిపారు. ఒకవేళ లీగల్ ప్రొసీజర్‌లో జాప్యం జరిగితే ఆ మేరకు ఆలస్యమవుతుందన్నారు.
సాధారణంగా ఒక వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనాలంటే పన్నెండేళ్ళు పడుతుందని, రోటా వైరస్‌కు ఏకంగా 16 సంవత్సరాలు పట్టిందని, కానీ ఇప్పుడు కరోనా కోసం తయారుచేయాలనుకుంటున్న కోవాక్సిన్ కోసం చాలా వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. అనేక దేశాల్లోనూ ఇలాంటి వ్యాక్సిన్ పరిశోధనలు ఇలాగే వేగంగా జరుగుతున్నాయన్నారు.