ఏలూరు పోలీస్ స్టేషన్‌లో కరోనా

by  |
ఏలూరు పోలీస్ స్టేషన్‌లో కరోనా
X

దిశ ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపింది. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. మరోవైపు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒకేసారి 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో పోలీసు శాఖలో ఆందోళన రేపుతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కరోనా సోకిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తగా వారందర్నీ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.

Next Story