ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా

by srinivas |
ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 21 కరోనా కేసులు బయటపడగా, మరిన్ని కేసులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా అనుమానాలతో 24 మందిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్‌కు తరలించారు. అలాగే మరో 9 మందిని కాకినాడ జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్‌కు తరలించారు.

అనంతపురం జిల్లాలో కూడా కరోనా కల్లోలం మొదలైంది. ఉరవకొండ, వజ్రకరూరుకు చెందిన ఐదుగురిని ఐసొలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకోవైపు కృష్ణా జిల్లాలో కూడా కరోనా కలకలం మొదలైంది. మతప్రార్థన కోసం ఢిల్లీ వెళ్లిన వారికి కరోనా సోకి ఉంటుందన్నభయం స్థానికల్లో ఆందోళనకు కారణమవుతోంది. మచిలీపట్నంలో పలువుర్ని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించినట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఏపీలో రోజూ రెండు లేదా మూడు కరోనా కేసులు బయపడుతుండడం ఆందోళన రేపుతోంది. విశాఖపట్టణంలో కరోనా ఆందోళన సద్దుమణగలేదు. వైజాగ్‌లో కరోనా రెడ్ జోన్లు ఉన్న నేపథ్యంలో మరింత మందికి పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా భయం ఇంకా ఎంతకాలం నెలకొంటుంది?ఇంకెన్ని రోజులు ఇళ్లకే పరిమితం కావాలంటూ వాకబుచేస్తున్నారు. మరోవైపు భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,024కు చేరుకుంది. మృతుల సంఖ్య 28కి చేరుకుంది.

Tags: corona, ap, covid-19, anantapur, kakinada, east godavari, rajamundry

Advertisement

Next Story

Most Viewed