- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో కరోనా @ 1777
దిశ, బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొండవీటి చాంతాడులా పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 23 నుంచి ప్రతి రోజూ 60కి పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ మరింత విస్తృతమవుతున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకున్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 60 మందికి కరోనా పాజిటివ్ సొకిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఏపీలో కరోనా రాజధాని కర్నూలు జిల్లాలో నేడు కూడా కరోనా కొలిక్కి రాలేదు. గత వారం రోజులతో పోలిస్తే ఈ రోజు కాస్త నెమ్మదించినట్టే కనిపిస్తోంది. ఈ రోజు 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 533కి చేరింది. ప్రస్తుతం ఈ జిల్లాలో 369 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 153 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 11 మంది మృత్యువాత పడ్డారు.
కృష్ణా జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 300కి చేరుకుంది. ఇందులో 173 మంది చికిత్స పొందుతుంటే, 117 మంది కోలుకున్నారు. 10 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో కూడా కరోనా కట్టడి కావడం లేదు. దీంతో గడచిన 24 గంటల్లో ఈ జిల్లాలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 363కి చేరుకుంది. ఇందులో 129 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయితే 226 మంది చికిత్స పొందుతున్నారు. 8 మంది మరణించారు.
తూర్పు గోదావరిలో 1, కపడలో 1, విశాఖపట్నంలో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,777కి చేరుకుంది. వారిలో ఇప్పటివరకు 729 మంది డిశ్చార్జ్ కాగా, 36 మంది మరణించారు. 1,012 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 7,782 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ఇప్పటి వరకు 1,41,274 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Tags: corona virus, corona positive, covid-19, corona in ap, ap health department