- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్‌ఆర్‌ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇందూరులో హాట్ స్పాట్ టెన్షన్..!
దిశ, నిజామాబాద్:
భారత్ సహా ప్రపంచాన్ని కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి కుదిపేస్తోంది. భారత్‌లో గురువారం ఒక్కరోజే 400కు పైగా కేసులు నమోదు కాగా, తెలంగాణలో 27 మందికి వైరస్ ఉన్నట్టు తేలగా మొత్తం సంఖ్య 154కు చేరింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం జిల్లాలోని పలు ప్రాంతాలను హాట్ స్పాట్ కేంద్రాలుగా ప్రకటించింది. దీంతో జిల్లాలో టెన్షన్ స్టార్ట్ అయింది. హాట్ స్పాట్ కేంద్రాలో ఉన్న వారు మునుపు ఎంత మందితో సంభాషించారో, తద్వారా ఎంత మందికి కరోనా అంటించారో అని చర్చించుకుంటున్నారు.
జిల్లాలో క్వారంటైన్‌లో 174 మంది..
నిజామాబాద్ జిల్లా నుంచి ఢిల్లీలో జరిగిన తబ్లీగ్ జమాత్ మర్కజ్‌కు 57 మంది వరకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. అయితే, ఇందులో 42 మంది క్వారంటైన్‌కు వెళ్లగా మిగిలిన 15 మంది ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి కరోనా సోకినట్టు తెలియడంతో పరీక్షలు నిర్వహించారు. అదే తొలి కరోనా పాజిటివ్ కేసు. అతనితో పాటు ఉన్న వ్యక్తినీ ఐసోలేషన్‌కు తరలించారు. అయితే, ఆయన అక్కడ గుండే పోటుతో మృతి చెందాడు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మనువడికి పరీక్షలు చేయగా పాజిటివని తేలింది. మూడేండ్ల బాలుడిలోనూ వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో జిల్లా నుంచి 42 మంది రక్త నమూనాలు పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. జిల్లాలో మూడు చోట్ల క్వారంటైన్‌లో 174 మంది ఉన్నారు. ఈ గణంకాలను పరిగణనలోకి తీసుకుని లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే, రెండో దశను కరోనా దాటే పరిస్థితి ఉండటంతో హట్ స్పాట్ కేంద్రాలు ప్రకటించినట్టు తెలుస్తోంది.
సర్వేకు సహయ నిరాకరణ..
నిజామాబాద్‌లో కరోనా కట్టడికి నివారణా చర్యలు అధికార యంత్రాంగానికి కత్తి మీద సాములా మారింది. ఎందుకంటే కరోనాతో తొలి మరణం సంభవించినప్పుడు జిల్లా ఆస్పత్రిలోని వైద్యులపై దాడికి యత్నించారు పాజిటివ్ రోగి బంధువులు. ఆస్పత్రి ఫర్నీచర్, సామగ్రి ధ్వంసం చేసి హంగామా చేశారు. అయినా పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదు. నిజామాబాద్ నగరంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు, క్వారంటైన్‌లో జనాలు అధికంగా ఉన్న ఖిల్లా, మాలపల్లి, ఆటోనగర్, ఎన్‌ఆర్‌ఐ కాలనీ, భర్కత్‌పురలో ఇంటింటి సర్వేకు అధికారులు పూనుకున్నారు. అరోగ్య కార్యకర్తలు ఇండ్లలోకి వివరాల సేకరణకు వెళ్తే అందుకు ఆ ప్రాంతాల వారు అనుమతించలేదు. ఒకటి రెండు చోట్ల వైద్య మహిళా సిబ్బందిపై కుక్కలను ఉసిగొల్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ 123 బృందాల చేత 18 వేల ఇళ్లను సర్వే చేశారు. కాని కొన్ని చోట్ల ఇంటికి తాళాలు వేసి ఉన్నాయని సమాచారం. దాంతో సర్వే పాక్షికంగానే జరిగిందనీ, కరోనా నిర్ధారణకు పూర్తిగా ఉపయోగపడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారులు సర్వే విషయం సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లాక్ డౌన్..బ్రేక్ డౌన్..
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 23 నుంచి లాక్ డౌన్ అమల్లో ఉన్నా నిజామాబాద్ దక్షిణ ప్రాంతంలో లాక్ డౌన్ ‘బ్రేక్’ చేయబడుతోందనీ, జిల్లా అధికార యంత్రాంగం అక్కడ అమలుకు చర్యలు తీసుకోవడంలో విఫలమయిందనే విమర్శలు వస్తున్నాయి. జీవో 45, 46ను కచ్చితంగా అమలు చేయడాన్ని యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్ – మర్కజ్ మతప్రార్థనలకు వెళ్లిన వారి నివేదికలపై సర్వే మొదలుకొని ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలన్నా స్థానికులెవరూ పట్టించుకోవడం లేదు. దుకాణాలు బంద్ చేశారు. కాని జనాలు గల్లీలలో, కాలనీలలో గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. వీరిని కట్టడి చేసే పోలీసులు కనబడటం లేదు. ఈ విషయమై పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకోవాలనీ, లేదంటే కోవిడ్ 19 ఇంకా విస్తరిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ ఉల్లం‘ఘనుల’పై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఇప్పటికే రెండేండ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం ఆదేశించిందని పలువురు చెబుతున్నారు.
Tags: corona virus, covid 19, high alert, hot spot centres, positive cases