జర్నలిస్ట్‌లకు కరోనా హెల్ప్ డెస్క్

by Shyam |
Corona Help Desk
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్ట్‌లకు వారి కుటుంబ స‌భ్యులకు ప్రత్యేకంగా కరోనా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టుగా ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ప్రకటించారు. ఫ్రంట్‌ లైన్ వారియ‌ర్‌లతో స‌మానంగా సేవ‌లందిస్తున్న జర్నలిస్ట్‌లను ఆదుకునేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిందని తెలిపారు. కరోనా వ్యాధి బారిన పడిన జర్నలిస్ట్‌లు వారి కుటుంభ సభ్యులు 8639710241 నెంబ‌ర్‌కు వివ‌రాలు వాట్సాప్ చేస్తే అవ‌స‌ర‌మైన మందులు, ప‌డ‌క‌లు, ఇత‌ర ఎమ‌ర్జెన్సీ సేవ‌లు అందిస్తామన్నారు. ప్రత్యేకంగా నియ‌మించిన‌ వైద్య నిపుణులచే వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. ఇప్పటికే ప‌లువురున జర్నలిస్ట్‌లు హెల్ప్‌లైన్ కు వివ‌రాలు పంపించార‌ని, వారికి స‌హాయం చేసే కార్యక్రమం మొద‌లైంద‌ని వివరించారు. కరోనా వ్యాధి సోకిన జర్నలిస్ట్‌లు ఈ సదుపాయపాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story