చౌటుప్పల్‌లో కూరగాయల వ్యాపారికి కరోనా

by vinod kumar |
చౌటుప్పల్‌లో కూరగాయల వ్యాపారికి కరోనా
X

దిశ, నల్లగొండ: చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. తాజాగా మరో కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్య అధికారులు ధృవీకరించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ వెనెరెడ్డి రాజు కూరగాయల వ్యాపారులందరికి థర్మల్ స్క్రీనింగ్ చేయించి, కూరగాయల మార్కెట్‌ను మూసివేయించారు. కూరగాయల వ్యాపారితో కాంటాక్ట్‌లో ఉన్న 75 మందిని హోమ్ క్వారంటైన్‌కు తరలించారు.

Advertisement

Next Story