శరీరంలో కరోనా టార్గెట్ చేసేది ఈ భాగాన్నే!

by sudharani |   ( Updated:2020-05-04 06:31:38.0  )
శరీరంలో కరోనా టార్గెట్ చేసేది ఈ భాగాన్నే!
X

దిశ, వెబ్‌డెస్క్: నావెల్ కరోనా వైరస్ ఎక్కువగా ఏ శరీర భాగాన్ని టార్గెట్ చేస్తోందో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొందరు కొవిడ్ 19 పేషెంట్లలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు దీని గురించి అధ్యయనం చేశారు. వారి అధ్యయనంలో కరోనా వైరస్ ముఖ్యంగా పెద్ద పేగును టార్గెట్ చేస్తోందని తెలుసుకున్నారు.

ఈ వైరస్, ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియల్ కణాలతో చర్య పొంది ఏసీఈ అనే ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైము ద్వారా తర్వాత పెద్దపేగులో ప్రవేశించి రెప్లికేట్ అవుతుందని వైద్యులు కనిపెట్టారు. నెదర్లాండ్స్ లోని ఎరామస్ మెడికల్ సెంటర్ వైద్యులు ఈ పరిశోధన చేశారు. అందుకే కొవిడ్ 19 పేషెంట్లు డయేరియా బారిన పడుతున్నారని వారు తేల్చి చెప్పారు. త్రీడీ మోఢళ్లలో కణనిర్మితాలను ఏర్పాటు చేసి వాటిని కరోనా వైరస్‌తో మిళితం చేసి ఈ విషయాలను కనిపెట్టారు.

Tags – corona, vaccines, WHO, HIV, Dengue, virus, pandemic

Advertisement

Next Story